breaking news
vardanna pet
-
వర్ధన్నపేటలో దొంగలు బీభత్సం
వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం లేబర్తి గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు ఇళ్లలో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. శుక్రవారం ఉదయం తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదుతో పాటు 5 తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
వర్థన్నపేట ఎస్సై సస్పెన్షన్
వరంగల్ : వరంగల్ జిల్లాలో వర్తన్నపేట ఎస్ఐ పై వేటు పడింది. వివరాలు.. గత శనివారం వర్థన్నపేట పోలీస్స్టేషన్లో ఐదో తరగతి చదువుతున్న ఓ బలుడిని వేధించిన క్రిష్ణకుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ డీజీపీ వరంగల్ రేంజ్ డీఐజీని ఆదేశించారు. అంతేకాకుండా, ఎస్సై తీరుపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా, స్తానికి గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న వీరన్న అనే బాలుడు ని పిబ్రవరి 28 న దొంగతనం నెపంతో పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న హాస్టల్ వార్డన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడిని హాస్టల్ కు తీసుకెళతామన్నా విడిచిపెట్టలేదు. రాత్రంతా బాలుడిని స్టేషన్ లోని నేరస్తులతో కలిపి మొద్దును కాళ్లకు బిగించి తాళాలు వేశారు. ఈ ఉదంతంపై బాలల హక్కుల సంఘం హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.