జాతరలో అర్ధనగ్న నృత్యాలు | recording dance at devotional place kolaru | Sakshi
Sakshi News home page

జాతరలో అర్ధనగ్న నృత్యాలు

Apr 5 2017 1:41 PM | Updated on Sep 5 2017 8:01 AM

జాతరలో అర్ధనగ్న నృత్యాలు

జాతరలో అర్ధనగ్న నృత్యాలు

భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి.

బెంగళూరు(కోలారు) :
భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. ఈఘటన తాలూకాలోని వానరాశి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వీరళప్ప స్వామి జాతర  నిర్వహించారు. ఈ సందర్భంగా  తుమకూరు సంజయ్‌ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో కొందరు మహిళా డ్యాన్సర్లు ఒంటిపై దుస్తులు తీసేసి అర్ధనగ్నంగా మారి తెలుగు, హిందీపాటలకు నృత్యాలు చేశారు.

భక్తితో జాతరకు వస్తే ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వచ్చిందని పలువురు భక్తులు వాపోయారు. పోలీసులు బందోబస్తులో ఉన్నా అశ్లీల నృత్యాలపై ఉదాసీనంగా వ్యవహరించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దృశ్యాలను పలువురు సెల్‌ఫోన్లలో రికార్డ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement