పెళ్లి పేరుతో వంచించి.. అత్యాచారం | Rape in the name of the wedding gags . | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో వంచించి.. అత్యాచారం

Mar 25 2017 10:15 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఓ యువకుడు మాయమాటలతో బాలికను లోబర్చుకొని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.

► గర్భం దాల్చిన మైనర్‌ బాలిక
► నిందితుడి అరెస్ట్‌
 యశ్వంతపుర: ఓ యువకుడు మాయమాటలతో బాలికను లోబర్చుకొని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం వెలుగు చూడటంతో​ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు మంగళూరు జిల్లాలోని కోణాజేకు చెందిన అనూప్‌ జోగి (28) బెంగళూరులోని ఓ న్యూస్‌ చానల్‌లో వీడియో గ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి విద్యార్థినితో రెండేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివాహం చేసుకోవాలని బాలిక కోరగా బెదిరిస్తూ వచ్చాడు. దీంతో బాలిక విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండి పోయింది. బాలిక శరీరంలో​ వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
 ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఎనిమిది నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బెంగళూరులో ఉండటంతో​ అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నిందితుడు మంగళూరులోనే ఉన్నట్లు తేలడంతో కొణాజే పోలీసులు గాలింపు చేపట్టి అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement