మారిన పొరంబోకు టైటిల్ | Purampokku gets a title change | Sakshi
Sakshi News home page

మారిన పొరంబోకు టైటిల్

Apr 2 2015 2:04 AM | Updated on Sep 2 2017 11:42 PM

మారిన పొరంబోకు టైటిల్

మారిన పొరంబోకు టైటిల్

పొరంబోకు చిత్రం ఇప్పుడు పొరంబోకు ‘ఎన్గిర పొదువుడమై’గా మారింది. ఆర్య, విజయ్ సేతుపతి,

పొరంబోకు చిత్రం ఇప్పుడు పొరంబోకు ‘ఎన్గిర పొదువుడమై’గా మారింది. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. నటి కార్తిక హీరోయిన్‌గా  నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జాతీయ అవార్డును గెలుచుకున్న ఇయర్కై చిత్రంతో పాటు ఈ, పేరాన్మై లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారన్నది గమనార్హం. యూటీవీ మోషన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
 కాగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర దర్శకుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నిజానికి పొరంబోకు అంటే ప్రజలు ఉపయోగానికిసరిపోగా మిగిలిన ప్రభుత్వ భూములన్ని పొరంబోకు భూమి అంటారన్నారు. ఇది తమిళభాషకు చెందిన పదమేనని తెలిపారు. చిత్ర టైటిల్ కూడా విభిన్నంగా ఉందని చాలామంది అన్నారన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలనే పొరంబోకు ఎన్గిర పొదువుడమైగా టైటిల్‌ను మార్చినట్లు చెప్పారు. ఎన్‌కే ఏకాం బరం చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి నవ సంగీత దర్శకుడు వర్షన్ సంగీత బాణీలు కట్టినట్లు తెలిపారు. చిత్ర ఆడియోను ఈ నెలలో విడుదల చేసి చిత్రాన్ని మే డే సందర్భంగా     తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement