సీబీఐకి సిద్ధం | Prepare to CBI | Sakshi
Sakshi News home page

సీబీఐకి సిద్ధం

Mar 20 2015 2:38 AM | Updated on Sep 2 2017 11:06 PM

ఐఏఎస్ అధికారి డి.కె.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా.....

అంతకు ముందు కర్ణాటక ప్రభుత్వం అనుమతించాలి
లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ వెల్లడి

 
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ లోకసభలో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు గురువారం సైతం తమ నిరసనను కొనసాగించారు. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్‌జోషి లోక్‌సభలో ఈ విషయాన్ని గురువారం సైతం ప్రస్తావించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల మన్ననలు అందుకున్న డి.కె.రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని ప్రహ్లాద్‌జోషి తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిందని, అయితే సీఐడీ విచారణపై డి.కె.రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రజలందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. అందుకే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని డి.కె.రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ...‘ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే విచారణ జరిపేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం’ అని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement