మహిళపై దాడికేసులో కానిస్టేబుల్పై వేటు | Policeman who attacked woman sacked | Sakshi
Sakshi News home page

మహిళపై దాడికేసులో కానిస్టేబుల్పై వేటు

May 11 2015 7:17 PM | Updated on Nov 6 2018 8:51 PM

లంచం ఇవ్వలేదని ఓ మహిళపై ఇటుకతో దాడి చేసిన కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్పై వేటు పడింది. అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది.

న్యూఢిల్లీ : లంచం ఇవ్వలేదని ఓ మహిళపై ఇటుకతో దాడి చేసిన కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపై వేటు పడింది. అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు.  అండర్ ఆర్టికల్ 311 (2) (బి) సెక్షన్ ప్రకారం ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.  కాగా ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు రూ.200 లంచం ఇవ్వాలంటూ ఓ మహిళను సతీష్ చంద్ర డిమాండ్ చేశాడు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించటంతో ఇటుకతో ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రాయి పట్టుకుని మహిళను కొడుతున్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేయటంతో సరిపోదన్నారు. కాగా ఈ కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement