నిమ్మవాగులో బయటపడ్డ తుపాకులు | pistels found in nimmavagu | Sakshi
Sakshi News home page

నిమ్మవాగులో బయటపడ్డ తుపాకులు

Mar 20 2017 4:55 PM | Updated on Oct 8 2018 8:37 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిమ్మ వాగు చెరువులో రెండు తుపాకులు సోమవారం బయటపడ్డాయి.

గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ సమీపంలోని నిమ్మ వాగు చెరువులో రెండు తుపాకులు సోమవారం బయటపడ్డాయి. తుపాకులు రెండూ తుప్పుపట్టి ఉన్నాయి. స్థానికులు వాటిని గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు వాగులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement