సమాచారం, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలి: డీజీపీ

Information Transport Is Important Says DGP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నేరాల నియంత్రణలో రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సమాచార మార్పిడి, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం భువనేశ్వర్‌లో సదtరన్‌ రాష్ట్రాల డీజీపీల భేటీ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు కృషి చేస్తున్న అంశాలు, ప్రణాళికలపై డీజీపీలు చర్చించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న టెక్నాలజీ వ్యవస్థపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సదస్సులో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top