‘పానాసోనిక్’ రంగుల కుక్కర్లు | 'Panasonic' colorful cookers | Sakshi
Sakshi News home page

‘పానాసోనిక్’ రంగుల కుక్కర్లు

May 10 2014 3:34 AM | Updated on Sep 2 2017 7:08 AM

‘పానాసోనిక్’ రంగుల కుక్కర్లు

‘పానాసోనిక్’ రంగుల కుక్కర్లు

గృహోపకరణాల విభాగంలో వినూత్న శ్రేణి కుక్కర్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు పానాసోనిక్ మేనేజింగ్ డెరైక్టర్ హిడనేరి సో పేర్కొన్నారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి: గృహోపకరణాల విభాగంలో వినూత్న శ్రేణి కుక్కర్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు పానాసోనిక్ మేనేజింగ్ డెరైక్టర్ హిడనేరి సో పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాష్ట్ర మార్కెట్‌లోకి రంగుల కుక్కర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనరల్ మేనేజర్ షెనాయ్, చీఫ్ ఫ్యాక్టరీ ఆఫీసర్లతో కలిసి ఆయన మాట్లాడారు. విదేశీ విడి వస్తువులతో నిమిత్తం లేకుండా భారత్‌లోనే పూర్తిస్థాయి తయారీ తమ ప్రత్యేకతన్నారు. అందుకే వినియోగదారుల సం ఖ్య ఇటీవల కోటి దాటిందని చెప్పారు.

 ప్రతి వస్తువులోనూ కొత్తదనాన్ని అందించాలనే తపనతో స్పెక్ట్రమ్ రేంజ్ పేరుతో తొలిసారిగా ఏడు రంగుల్లో కుక్కర్లు విడుదల చేశామన్నారు. పూర్తి గా మెటాలిక్ రంగుల్లో కుక్కర్ల శ్రేణి దేశంలోనే ప్రథమని తెలిపారు. 150 గ్రాములు మొదలుకుని 4.5 కిలోల సామర్థ్యం గల కుక్కర్లను ప్రవేశపెట్టామని తెలిపారు.

వంటగ్యాస్ ఖర్చుతో పోల్చుకుంటే 40 శాతం ఆదా అని చెప్పారు. వీటి ధర రూ.1899 నుంచి రూ.12,990 వరకు ఉందన్నారు. పానాసోనిక్‌తోపాటు ఏ కంపెనీ కుక్కరైనా అందజేసి ఎక్సేంజ్ విధానంతో కొత్త కుక్కర్‌ను పొందవచ్చని తెలిపారు. చెన్నైలోని తమ ఉత్పత్తి కేంద్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement