కదిరిలో మంత్రి పల్లె కళాశాల సీజ్‌ | palle raghunatha reddy college seized in kadiri | Sakshi
Sakshi News home page

కదిరిలో మంత్రి పల్లె కళాశాల సీజ్‌

Mar 7 2017 11:35 AM | Updated on Sep 5 2017 5:27 AM

కదిరిలో మంత్రి పల్లె కళాశాల సీజ్‌

కదిరిలో మంత్రి పల్లె కళాశాల సీజ్‌

అనంతపురం జిల్లా కదిరి పట‍్టణంలో ఉన‍్న మంత్రి పల‍్లె రఘనాథరెడ్డికి చెందిన కాలేజ్‌ ను అధికారులు సీజ్‌ చేశారు.

కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట‍్టణంలో ఉన‍్న మంత్రి పల‍్లె రఘనాథరెడ్డికి చెందిన కాలేజ్‌ ను అధికారులు సీజ్‌ చేశారు. స్థానికంగా పల్లె రఘునాధ్‌ రెడ్డికి చెందిన శ్రీనివాస కళాశాల గత ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. దాదాపు రూ. 1.65 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది. మున్సిపల్‌ అధికారులు ఎన్ని సార్లు నోటీసులు పంపినా కాలేజ్‌ యాజమాన్యం స్పందించలేదు.
 
దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌ మంగళవారం ఉదయం సీజ్‌ చేశారు. ఉదయం కళాశాలకు వెళ్లిన కమిషనర్‌ విద్యార్థులను బయటకు పంపి కాలేజ్‌ గేటుకు తాళం వేసి సీజ్‌ చేశారు. ఎన్ని నోటీసులు పం0పినా కళాశాల యాజమాన‍్యం స‍్పందించకపోవడంతో చట‍్టరీత్యా చర‍్యలు తీసుకున‍్నామని కమిషనర్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement