కిలో ఉల్లి రూ.1 | onion Kg just Rs.1 | Sakshi
Sakshi News home page

కిలో ఉల్లి రూ.1

Sep 4 2015 9:55 AM | Updated on Sep 3 2017 8:44 AM

కిలో ఉల్లి రూ.1

కిలో ఉల్లి రూ.1

ఎంకామర్స్ రంగంలోని నింజాకార్ట్ సంస్థ వినియోగదారుల కోసం కిలో ఉల్లిపాయలను రూ.1కే అందజేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు తిరుకుమారన్ నాగరాజన్ వెల్లడించారు.

బెంగుళూరు : ఎంకామర్స్ రంగంలోని నింజాకార్ట్ సంస్థ వినియోగదారుల కోసం కిలో ఉల్లిపాయలను రూ.1కే అందజేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు తిరుకుమారన్ నాగరాజన్ వెల్లడించారు.  బుధవారం సాయంత్రం ఆయన బెంగళూరులో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

గురువారం నుంచి శనివారం వరకూ ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు. తమ సంస్థ రూపొందించిన నింజాకార్ట్ మొబైల్ యాప్ నుంచి మాత్రమే ఉల్లిపాయలు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కిలో మాత్రమే అందజేస్తారు.


 
 

Advertisement
 
Advertisement
Advertisement