8న కోలారు-చిక్కబళ్లాపురం రైలు ప్రారంభం | On 8-Cola - cikkaballapuram train early | Sakshi
Sakshi News home page

8న కోలారు-చిక్కబళ్లాపురం రైలు ప్రారంభం

Nov 5 2013 4:32 AM | Updated on Sep 2 2017 12:16 AM

కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కోలార్ - చిక్కబళ్లాపురం రైలును ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కే హెచ్ మునియప్ప తెలిపారు.

కోలారు, న్యూస్‌లైన్ :   కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కోలార్ - చిక్కబళ్లాపురం రైలును ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కే హెచ్ మునియప్ప తెలిపారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాడ్‌గేజ్ లైన్‌ను ఈ నెల 8న  కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే ప్రారంభిస్తారన్నారు. మైసూరు మహారాజ్‌లు ప్రారంభించి న రైళ్లను కొనసాగించాలని స్థానికుల నుంచి వచ్చిన డిమాండుకు అనుగుణంగా బ్రాడ్ గేజ్‌గా మార్చామన్నారు.

అదే విధంగా కోలారు - వైట్‌ఫీల్డ్, కోలారు- ముళబాగిలు, కేజీఎఫ్-కుప్పం, బంగారుపేట-మారికుప్పం, శ్రీనివాసపురం - మదనపల్లి తదితర రైల్వేలైన్లకు సంబంధించి భూ స్వాధీనం, సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, మాజీ మంత్రి నిసార్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ మాజీ అధ్యక్షుడు జన్నఘట్ట వెంకటమునియప్ప పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement