నాకు స్వేచ్ఛ ఉంది | no Conditions my husband says Ananya | Sakshi
Sakshi News home page

నాకు స్వేచ్ఛ ఉంది

Mar 9 2015 2:25 AM | Updated on Sep 2 2017 10:31 PM

నాకు స్వేచ్ఛ ఉంది

నాకు స్వేచ్ఛ ఉంది

నటన విషయంలో నటి అనన్యకు ఆమె భర్త షరతులు విధించారట. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు.

నటన విషయంలో నటి అనన్యకు ఆమె భర్త షరతులు విధించారట. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ఎంగేయుం ఎప్పోదుం, నాడోడిగళ్ లాంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన కేరల కుట్టి అనన్య కుటుంబ కథా చిత్రాల కథా నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆంజనేయన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించినా పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. దీంతో పలు అవకాశాలు కోల్పోయింది. అంతేకాదు నటనకు స్వస్తి పలికినట్లు కూడా ప్రచారం జరిగింది. వీటన్నింటి కీ అనన్య బదులిస్తూ తాను నటనకు దూరమయ్యానని ఎవరు చెప్పారు? అంటూ ప్రశ్నించారు.
 
  అయితే తనకు సంతృప్తి కలిగించే చిత్రాలనే అంగీకరిస్తున్నానన్నారు. అందువలన చిత్రాల సంఖ్య తగ్గిందన్న మాట వాస్తవేమనన్నారు. ఇటీవల మలయాళంలో రిపోర్టర్ చిత్రంలో నటించానని చెప్పారు. వివాహానంతరం తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన భర్త ఆంజనేయన్ కూడా తనకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నటన వరకు ఆయన తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అయితే గ్లామరస్ పాత్రలను అంగీకరించనట్టు, మంచి కథా పాత్రల్ని ఎంపిక చేసుకుని నటించులాంటి కొన్ని సూచనలు చేశారని చెప్పారు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటించడం కోసం పలు కథలు వింటున్నానని త్వరలోనే కొత్తగా నటించే చిత్రాల గురించి వివరిస్తానని అనన్య పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement