న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్భయ నిధిని మహిళల భద్రత కోసం ఖర్చు చేయనున్నట్లు రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. నగరంలో తిరిగే అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఆటోల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మహిళల భద్రతకే నిర్భయ నిధి
Sep 28 2013 12:39 AM | Updated on Aug 20 2018 9:16 PM
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్భయ నిధిని మహిళల భద్రత కోసం ఖర్చు చేయనున్నట్లు రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. నగరంలో తిరిగే అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఆటోల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 కోట్ల నిధిని ఖర్చు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో వీటిని కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతామన్నారు. అంతేకాక ప్రజారవాణా వ్యవస్థలో మహిళలకు కూడా స్థానం కల్పిం చాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం మహిళా డ్రైవర్లను నియమించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు.
ఈ విషయాలన్నింటితో ఓ ప్రెజెంటేషన్‌ను ఆర్థికశాఖ సలహాలు, సూచనల కోసం పంపుతామని, అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా మార్పులు చేర్పులు చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దేశ రాజధానిలో గత సంవత్సరం డిసెంబర్ 16న వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన తర్వాత వెల్లువెత్తిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరం బడ్జెట్‌లో ‘నిర్భయ నిధి’ పేరుతో రూ.1,000 కోట్లను కేటాయించిన విష యం తెలిసిందే. అయితే వీటిని మహిళల భద్రత కోసం వినియోగిస్తామని అప్పట్లోనే ప్రకటించినా దాదాపు ఏడాది పూర్తికావొస్తున్నా నిధులను ఖర్చుచేయలేదు. దీనిపై కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతుండడంతో రహదారుల మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనలను రూపొందించే పనిలో నిమగ్నమైంది.
ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అనుమతి లభిస్తే నగరంలో మహిళల భద్రతకు కొంతమేరైనా భరోసా లభిస్తుందని స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉండగా నిర్భ య ఘటన తర్వాత నగరవ్యాప్తంగా ప్రధాన కూడళ్ల లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా అటువంటి చర్యలేవీ తీసుకోలేదని, రహదారుల మంత్రిత్వశాఖ అయినా మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో పనిచే యాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. సీసీ టీవీ కెమెరాలు, జీపీఎస్‌లు ఏర్పాటు చేయడమే గాకుండా వాటి నిర్వహణ భాద్యతలను సమర్థ వంతమైన సంస్థలకు అప్పజెప్పాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement