జేసీబీలో ఊరేగిన వధూవరులు | Newly Married Couple Going Procession in JCB Vehicle | Sakshi
Sakshi News home page

జేసీబీలో ఊరేగిన వధూవరులు

Jun 20 2018 11:50 AM | Updated on Jun 20 2018 3:18 PM

Newly Married Couple Going Procession in JCB Vehicle - Sakshi

బొమ్మనహళ్లి : పెళ్లి అనేది జీవితంలో మరుపురాని ఘట్టం. వారి వారి ఆర్థిక స్థోమతలను బట్టి వివాహాలను వైభవంగా చేసుకుంటారు. ఇందులో మరో తరహా వ్యక్తులు ఉంటారు. ఆకాశంలో, నీటి అడుగు భాగంలో పెళ్లిల్లు చేసుకుని సాహసాలు చేసేవారు మరికొందరు. ఇక్కడ జేసీబీలో ఊరేగుతున్న ఈ నూతన జంటను చూడండి... పనిపై ఉన్న ప్రేమతోనే సదరు వరుడు, వధువును ఒప్పించి పెళ్లి అయిన తరువాత ఊరేగింపు ఇలా వెరైటీగా చేసుకున్నారు. వివరాలు...  దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సంట్యార్‌ అనే ప్రాంతానికి చెందిన చేతన్‌ జేసీబీ ఆపరేటర్‌. పని పట్ల నిబద్దత ఎంతో ఎక్కువ. పనిని ప్రేమిస్తాడు.

 సోమవారం చేతన్‌కు మమతతో వివాహం జరిగింది. పెళ్లి తతంగం అంతా పూర్తయిన తరువాత పెళ్లి కుమారుడు చేతన్‌ జేసీబీలో ఊరేగింపు నిర్వహించాలని కోరాడు. ఇందుకు ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో ఒక జేసీబీని తెప్పించి దానికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నూతన వధూవురులను రెండు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేశారు. దారి పొడవునా వధువు ముసిముసి నవ్వులు అందర్ని ఆకట్టుకున్నాయి. చేతన్‌ స్థానికంగా మంచి పేరు ఉండటంతో పెద్ద ఎత్తున బంధువుల, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement