పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో ఖాళీ అయిన కౌన్సిలర్ల స్థానాలకు ఉప ఎన్నికల తేదీ ఖరారయింది.
9న మున్సిపాలిటీల ఉప ఎన్నిక
Mar 20 2017 3:02 PM | Updated on Oct 16 2018 7:36 PM
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో ఖాళీ అయిన కౌన్సిలర్ల స్థానాలకు ఉప ఎన్నికల తేదీ ఖరారయింది. కొవ్వూరు మున్సిపాలిటీలో 16 వార్డు టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ గత ఏడాది అదే పార్టీ నేతల మధ్య తలెత్తిన ఇసుక తగాదాలో హత్యకు గురయ్యారు. అలాగే, తణుకు మున్సిపాలిటీలో మూడో వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన ఇండిపెండెంట్ గా నెగ్గి టీడీపీలో చేరారు. ఈ రెండు స్థానాలకు వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది
Advertisement
Advertisement