అటవీ శాఖా మంత్రిగా ఆనందన్ | MSM Anandan Appointed as Forest Minister Again | Sakshi
Sakshi News home page

అటవీ శాఖా మంత్రిగా ఆనందన్

Aug 7 2015 2:28 AM | Updated on May 28 2018 4:09 PM

మాజీ మంత్రి ఆనందన్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కింది. అమ్మ కేబినేట్‌లో అటవీశాఖామంత్రిగా చేరబోతున్నారు. ఆదాయానికి

 చెన్నై,సాక్షి ప్రతినిధి: మాజీ మంత్రి ఆనందన్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కింది. అమ్మ కేబినేట్‌లో అటవీశాఖామంత్రిగా చేరబోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత జైలు కెళ్లిన తరువాత సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీర్‌సెల్వం మంత్రి వర్గంలో ఆనందన్ ఉన్నారు. మే 23వ తేదీన జయ మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సమయంలో ఆనందన్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఈ దశలో తిరుప్పూరు ఎమ్మెల్యే ఆనందన్‌ను అటవీశాఖా మంత్రిగా మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు జయ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్  రోశయ్య ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు.  9న మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిగా ఆనంద న్ పదవీ ప్రమాణం చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement