'రాష్ట్రంలో ఉప్పు కొరత లేదు' | minister paritala sunitha teleconference over salt issue | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో ఉప్పు కొరత లేదు'

Nov 12 2016 7:00 PM | Updated on Sep 4 2017 7:55 PM

'రాష్ట్రంలో ఉప్పు కొరత లేదు'

'రాష్ట్రంలో ఉప్పు కొరత లేదు'

రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని...కేవలం వ్యాపారులే కొరత సృష్టిస్తున్నారని మంత్రి చెప్పారు.

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా ఉప్పు కొరత లేదని...కేవలం వ్యాపారులే కొరత సృష్టిస్తున్నారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. ఉప్పు కొరతపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.

ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో శనివారం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప్పు, ఇతర నిత్యావసర వస్తువులకు కృత్రిమంగా కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పు కొరత ఉందనే వదంతులను నమ్మొద్దని, అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement