
మోదీతో మాట్లాడుతున్న మెహబూబా
పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.
మోదీకి కశ్మీర్ సీఎం మెహబూబా విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. మోదీతో ఆమె బుధవారమిక్కడ భేటీ అయ్యారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులపై, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కశ్మీరీల వేదనను తగ్గించే సమయం ఆసన్నమైందని ముఫ్తీ పేర్కొన్నారు.