breaking news
appealed
-
ఉద్రిక్తతను తగ్గించండి
మోదీకి కశ్మీర్ సీఎం మెహబూబా విజ్ఞప్తి న్యూఢిల్లీ: పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. మోదీతో ఆమె బుధవారమిక్కడ భేటీ అయ్యారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులపై, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కశ్మీరీల వేదనను తగ్గించే సమయం ఆసన్నమైందని ముఫ్తీ పేర్కొన్నారు. -
ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి
సివిల్స్‌పై మంత్రి జోగు రామన్నకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య వినతి సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వెయ్యిమంది బీసీ అభ్యర్థులకు పేరు పొందిన ప్రైవేట్ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సచివాలయంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే రాష్ర్టంలోని 12 బీసీ కులాల ఫెడరేషన్లు గ్రూపు రుణాలు కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. కాగా, బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలని బీసీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు.