ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి | want to training in private comany's for bc's | Sakshi
Sakshi News home page

ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి

Published Thu, Jul 28 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి

ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి

ఈ ఏడాది వెయ్యిమంది బీసీ అభ్యర్థులకు పేరు పొందిన ప్రైవేట్ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత

సివిల్స్‌పై మంత్రి జోగు రామన్నకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య వినతి

 సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వెయ్యిమంది బీసీ అభ్యర్థులకు పేరు పొందిన ప్రైవేట్ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సచివాలయంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే రాష్ర్టంలోని  12 బీసీ కులాల ఫెడరేషన్లు గ్రూపు రుణాలు కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. కాగా, బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలని బీసీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement