ప్రేమలో పడ్డ మేఘ్నా | Meghana Raj and Chiru Sarja to reveal their love story soon | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డ మేఘ్నా

Nov 20 2014 3:51 AM | Updated on Jul 25 2018 3:13 PM

ప్రేమలో పడ్డ మేఘ్నా - Sakshi

ప్రేమలో పడ్డ మేఘ్నా

నటి మేఘ్నారాజ్ ప్రేమలో జోగుతోంది. త్వరలో భాజా భజంత్రీలు కూడా మోగనున్నాయట. మేఘ్నా బహుభాషా నటి.

 నటి మేఘ్నారాజ్ ప్రేమలో జోగుతోంది. త్వరలో భాజా భజంత్రీలు కూడా మోగనున్నాయట. మేఘ్నా బహుభాషా నటి. తమిళంలో కాదల్ సొల్ల వందేన్, తిరు 420, నందా నందిత తదితర చిత్రాల్లో నటించింది. బెండు అప్పారావుతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ కన్నడ బ్యూటీ సహ కన్నడ నటుడు చిరంజీవి షార్జాతో ప్రేమాయణం సాగిస్తోందన్నది తాజా సమాచారం. తమిళంలో విజయం సాధించిన సండకొళి, పిజ్జా, కాక్క కాక్క, పైయ్యా చిత్రాల కన్నడ రీమేక్‌లో హీరోగా చిరంజీవి షార్జా నటించారు.
 
 ప్రస్తుతం పాండియనాడు చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. ఒక చిత్ర షూటింగ్‌లో కలుసుకున్న మేఘ్నారాజ్, చిరంజీవి షార్జ్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారిందట. దీంతో వీరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. మేఘ్నారాజ్‌కు ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా కన్నడం, మలయాళంలో నటిస్తున్నారు. ఆ చిత్రాల షూటింగ్ పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది చిరంజీవి షార్జ్‌తో పెళ్లికి రెడీఅవుతున్నట్లు కోలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement