మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ‍్నం ఒక ఉద‍్యోగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.
కలెక‍్టరేట్ వద‍్ద ఉద్యోగి ఆత‍్మహత్యాయత‍్నం
Feb 27 2017 3:31 PM | Updated on Sep 5 2017 4:46 AM
విజయవాడ: మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ‍్నం ఒక ఉద‍్యోగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయమని మీ కోసం కార‍్యక్రమంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో నూజివీడు ఉపాధి హామీ పనులు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివాజీ కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప‍్పంటించుకుని ఆత‍్మహత‍్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతనిని వారించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకుని శివాజీని ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు. సమస‍్యను ఉన‍్నతాధికారుల దృష్టికి తీసుకెళ‍్లి పరిష‍్కారమయ‍్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement