భార్య చెప్పిన మాట వినడం లేదని మనస్తాపానికి గురై గోదారిలోకి దూకాడో భర్త.
'భార్య చెప్పిన మాట వినడం లేదని..'
Sep 22 2016 4:18 PM | Updated on Aug 1 2018 2:35 PM
బూర్గంపాడు: భార్య చెప్పిన మాట వినడం లేదని మనస్తాపానికి గురైన భర్త గోదారిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక సారపాక వద్ద గల గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బండి రమేష్(28) కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తుంటాడు.
గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. భార్య వేరొకరితో చనువుగా ఉంటోందని అనుమానిస్తూ.. ఆమెను తన తీరు మార్చుకోవాలని అనేక సార్లు చెప్పినట్టు సమాచారం. అయినా ఆమె తన పద్థతి మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి సారపాక బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడ ఉన్న స్థానికలు గుర్తించి అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement