వివాహేతర సంబంధం: ఒకరి హత్య | Man killed over extra-marital affair | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: ఒకరి హత్య

Published Thu, Apr 6 2017 3:38 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

Man killed over extra-marital affair

గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరన్న(26) అనే యువకుడు ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోనే వీరన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉండటం గమనించి భర్తే, వీరన్న తలపై మోది చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement