ప్రేమికుడి ఆత్మహత్య | lover commits suicide | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి ఆత్మహత్య

Jul 24 2016 1:50 AM | Updated on Sep 4 2017 5:54 AM

ప్రేమికుడి ఆత్మహత్య

ప్రేమికుడి ఆత్మహత్య

ప్రియురాలిని తన నుంచి దూరం చేసారని మనస్తాపానికి గురైన ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

టీనగర్: ప్రియురాలిని తన నుంచి దూరం చేసారని మనస్తాపానికి గురైన ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన నీలగిరి జిల్లా కొత్తగిరిలో సమీపంలో చోటుచేసుకుంది. నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని కడసోలై గ్రామానికి చెందిన నందకుమార్ (24) , సోలూర్‌మట్టం ప్రాంతానికి చెందిన కరిష్మా (20) మూడు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మదురై కి పారిపోయారు.

 కాగా ఈ విషయమై కరిష్మా తల్లిదండ్రులు తమ కుమార్తెను నందకుమార్ కిడ్నాప్ చేసినట్లు సోలూర్‌మట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మదురైలో ఉన్న కరిష్మాను తీసుకొచ్చి పాలక్కాడులోని బంధువల ఇంట్లో ఉంచారు. దీంతో మనోవేదనకు గురైన నందకుమార్ గురువారం మేట్టుపాళయంలో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మేట్టుపాళయం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన బంధువులు, ప్రజలు అక్కడ రాస్తారోకో జరపడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement