నల‍్గొండ జిల్లాలో జరిగిన జంట హత‍్యల కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ మిర్యాలగూడ 8వ జిల్లా అదనపు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
జంట హత‍్యల కేసు: ఐదుగురికి జీవిత ఖైదు
Feb 14 2017 2:29 PM | Updated on Jul 10 2019 8:00 PM
మిర్యాలగూడ: నల‍్గొండ జిల్లాలో జరిగిన జంట హత‍్యల కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ మిర్యాలగూడ 8వ జిల్లా అదనపు న్యాయమూర్తి అజిత్‌సింహారావు మంగళవారం తీర్పు చెప్పారు. జీవిత ఖైదుతో పాటు ఒక‍్కొక‍్కరికి పదివేల రూపాయల జరిమానా విధించారు. దామచర‍్ల మండలం చట్నేపల్లి గ్రామానికి చెందిన తాపూరియా, హరి నారాయణ అనే వ‍్యక్తులను 2009 ఆగస్టు 3వ తేదీ దుండగులు హతమార్చారు. ఈ కేసులో వాదనలు విన‍్న న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. జంట హత‍్యల కేసులో వెంకటనారాయణ, రంగయ‍్య, చిన‍్న ఆంజనేయులు, సైదయ‍్య, బత్తిన రమణ అనే దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు.
Advertisement
Advertisement