నేను అలా నటిస్తే తప్పేంటి? | Lakshmi Menon goes from College to Ghost Town | Sakshi
Sakshi News home page

నేను అలా నటిస్తే తప్పేంటి?

Jul 15 2015 3:04 AM | Updated on Sep 3 2017 5:29 AM

నేను అలా నటిస్తే తప్పేంటి?

నేను అలా నటిస్తే తప్పేంటి?

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అంటారే సరిగ్గా అలాంటి పరిస్థితే. నటి లక్ష్మీమీనన్‌కు ఎదురైంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి

 అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అంటారే సరిగ్గా అలాంటి పరిస్థితే. నటి లక్ష్మీమీనన్‌కు ఎదురైంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌లో నెగ్గుకొచ్చిన ఈ మలయాళికుట్టికి తాజాగా గ్లామర్‌పై ఆశ పుట్టిందట. నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించిన లక్ష్మీమీనన్ ఈసారి అందాలారబోత తో కలకలం సృష్టించాలని భావించగా వేషం లభించిందట. ప్లస్-2 పాస్ అయిన కాలేజీకి వెళుతున్న ఈ కేరళకుట్టికి తాజాగా జయం రవికి జంటగా నటించే అవకాశం వచ్చింది.

భలే చాన్స్‌లే అని చంకంత కొట్టుకున్న ఈ భామ ఈ చిత్రంలో దెయ్యం పాత్ర లభించిందట. శక్తి శరణ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. కాగా మాయ చిత్రంలో నయనతార, అరణ్మణై -2లో హన్సిక లాంటి వారు దెయ్యం కథా చిత్రాలలో నటించడంతో తాను నటించడంలో తప్పేంటి? ఆ తరహా చిత్రం ఒక అనుభవమేగా అని సరిపెట్టుకొందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement