
‘నానో’ బారి నుంచి కాపాడండి
శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమను అడ్డుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గ్రామస్తులు వినతిపత్రం అందించారు.
ప్రస్తుతం గ్రామ పరిధిలో సాగునీటి ఆధారంగా ఏటా రెండుకార్ల పంటలు పండుతున్నాయని, కెమికల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మొత్తం విషపూరితమవుతుందని జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ గ్రామాలను నాశనం చేసేందకు పూనుకుందన్నారు. కొద్దిగా చొరవ తీసుకుని కెమికల్ పరిశ్రమను అడ్డుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, లాయర్‌బాలస్వామి, సుమిత్ర, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.