గృహిణిపై జిమ్ ఇన్‌స్ట్రక్టర్ చాకుతో దాడి | Knife attack on the housewife, the gym instructor | Sakshi
Sakshi News home page

గృహిణిపై జిమ్ ఇన్‌స్ట్రక్టర్ చాకుతో దాడి

Dec 9 2014 2:23 AM | Updated on Sep 2 2017 5:50 PM

గృహిణిపై జిమ్ ఇన్‌స్ట్రక్టర్ చాకుతో దాడి చేశాడు.

అనంతరం ఆత్మహత్యకు యత్నం

బెంగళూరు:  గృహిణిపై జిమ్ ఇన్‌స్ట్రక్టర్ చాకుతో దాడి చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన రామమూర్తినగరలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంజులా అనే గృహిణి త న కుమారుడిని పాఠశాల నుండి పిలుచుకురావడానికి వెళుతున్నారు. ఓఎంబీఆర్‌లేఔట్ లోని ఛాయా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి వద్ద జిమ్ ఇన్‌స్ట్రక్టర్  స్టీపెన్ మంజుళాను వెంబ డించాడు. అతని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయగా ఆమెను వెంబడించి చాకుతో పొట్టపై దాడిచేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు.

అనంతరం అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు గాయాలతో ఉన్న ఇద్దరిని ఛాయా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న రామమూర్తినగర పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఆమెపై వ్యామోహం తోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement