కేఎల్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి | KL University student falls from college building | Sakshi
Sakshi News home page

కేఎల్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి

Nov 28 2016 11:39 AM | Updated on Nov 9 2018 4:36 PM

యూనివర్సిటీ భవనం పై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు.

గుంటూరు: యూనివర్సిటీ భవనం పై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో.. బీటెక్ చదువుతున్న సాయి చరణ్(19) సోమవారం విశ్వవిద్యాలయ భవనం పై నుంచి కిందపడ్డారు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాయిచరణ్ స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలిగా తోటి విద్యార్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement