కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం | kidnappers arrested and Rs.1.5 crore sized in karnataka | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం

Jul 5 2014 8:18 AM | Updated on Sep 2 2017 9:51 AM

కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం

కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం

కిడ్నాప్‌కు గురైన మహిళను హెబ్బగుడి పోలీసులు క్షేమంగా రక్షించారు.

కిడ్నాప్‌కు గురైన మహిళను హెబ్బగుడి పోలీసులు క్షేమంగా రక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు..  హెబ్బగుడి సమీపంలో అనుసూయమ్మ నివాసముంటోంది. ఆమె కుటుంబ సభ్యులు భూలావాదేవీలు, రియల్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు దుండగులు అనుసూయమ్మను కిడ్నాప్ చేశారు.

 

రూ.1.50 కోట్లను ఇవ్వాలంటూ వారు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వారు ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ డబ్బును బెంగళూరు నగర శివార్లలో ఉన్న దుండగులకు ఇచ్చారు. దీంతో వారు అనుసూయమ్మ వదిలేసి.. డబ్బుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు పూర్తి వివరాలు వెల్లడించడానికి హెబ్బగుడి పోలీసులు నిరాకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement