జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ | kethireddy jagadishwar reddy contest in tamilnadu assemblye lection | Sakshi
Sakshi News home page

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

May 15 2016 4:43 PM | Updated on Sep 4 2017 12:10 AM

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్‌కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి  వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు.

తెలుగు భాషతో పాటు  తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement