కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు.
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న నాయకులు
Sep 25 2016 8:20 PM | Updated on Aug 30 2019 8:24 PM
గంభీర్‌రావుపేట : కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. గంభీర్‌రావుపేట మండలం మల్లుపల్లె వద్ద ఆదివారం సాయంత్రం సిరిసిల్ల సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను రహదారిపై తొలగించి మంత్రి కాన్వాయ్ను పంపించారు.
Advertisement
Advertisement