ఆడంబర దుస్తులంటే అలర్జీ | i dont like this Flamboyant dress says Lavanya Tripathi | Sakshi
Sakshi News home page

ఆడంబర దుస్తులంటే అలర్జీ

Mar 20 2015 3:26 AM | Updated on Sep 2 2017 11:06 PM

ఆడంబర దుస్తులంటే అలర్జీ

ఆడంబర దుస్తులంటే అలర్జీ

ఆడంబర దుస్తులు ధరించడం నటి లావణ్య త్రిపాఠికి అలర్జీలా వున్నట్లుంది. కొందరు హీరోయిన్లు తమ పాత్రకు సంబంధంలేని

 ఆడంబర దుస్తులు ధరించడం నటి లావణ్య త్రిపాఠికి అలర్జీలా వున్నట్లుంది. కొందరు హీరోయిన్లు తమ పాత్రకు సంబంధంలేని విధంగా దుస్తులు, నగలు ధరించి గొప్పగా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. కొందరు హీరోయిన్లు నిరాడంబరంగా కనిపించేందుకు ఇష్టపడతారు. శశికుమార్ హీరోగా ‘బ్రహ్మన్’ చిత్రంలో నటించిన లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ కథాపాత్రలకు తగిన విధంగాను, సన్నివేశానికి తగ్గట్టు దుస్తులు, నగలు ధరించాలనే విషయంపై దర్శకులు ఏ విధంగా శ్రద్ధ వహిస్తారో తాను కూడా అంతే శ్రద్ధ వహిస్తానన్నారు. వాస్తవంగా ఆడంబరమైన దుస్తులు ధరించడం తనకు సుతరామూ ఇష్టం లేదన్నారు. తక్కువగా నగలు ధరించడమే ఇష్టమని, చెవిలో చిన్న రింగులు, మెడలో చిన్న చెయిన్ మాత్రమే ధరిస్తానన్నారు. ఒక చిత్రంలో డాక్టర్‌గా నటిం చానని, ఆ సమయంలో తనకు ధగధగలాడే కాస్ట్యూమ్ అందజే శారన్నారు. అది ఆస్పత్రిలో చిత్రీకరించే సన్నివేశం కావడంతో తానే దానికి బదులు సాధారణ డ్రెస్ అందజేయమని డెరైక్టర్‌ను కోరానని, దీన్ని డెరైక్టర్ కూడా ప్రశంసించారన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement