12 మంది భూతవైద్యులు అరెస్టు | Hyderabad City Police Carden Search at old City | Sakshi
Sakshi News home page

12 మంది భూతవైద్యులు అరెస్టు

Sep 27 2016 3:52 PM | Updated on Sep 4 2018 5:24 PM

పాతబస్తీలో దక్షిణమండలం పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్ చేపట్టారు.

హైదరాబాద్: పాతబస్తీలో దక్షిణమండలం పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా భూతవైద్యం పేరుతో జనాన్ని మాయ చేస్తున్న 12 మంది ఇళ్లపై దాడులు చేశారు. అమాయక ప్రజలను మోసగిస్తున్న 12 మంది మంత్రగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మంత్రాలు చేస్తామంటూ ప్రజల నుంచి డబ్బు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement