భార‍్యపై భర్త యాసిడ్‌ దాడి | husband acid attack in wife | Sakshi
Sakshi News home page

భార‍్యపై భర్త యాసిడ్‌ దాడి

Apr 1 2017 12:12 PM | Updated on Aug 17 2018 2:10 PM

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని భాస్కర్‌రావు దిబ్బ ప్రాంతంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడిచేశాడు.

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని భాస్కర్‌రావు దిబ్బ ప్రాంతంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. భాస్కర్‌రావు దిబ్బలో ఉంటున్న బ్రహ్మం తన భార్య షేక్‌ రిజ్వానాపై యాసిడ్‌తో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పట్టణ టుటౌన్‌ ఎస్సై క్రాంతి సంఘటనా స్థలానికి చేరుకొని రిజ్వానాను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement