ఒకే కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల | Hubli Woman Gives Birth to Quadruplet | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురు!

Nov 11 2019 9:31 AM | Updated on Nov 11 2019 9:33 AM

Hubli Woman Gives Birth to Quadruplet - Sakshi

బొమ్మనహళ్లి/హుబ్లీ: ఒక కాన్పులో కవలలు జన్మిస్తే విశేషం. ముగ్గురు పుడితే వింత. ఏకంగా నలుగురు జన్మిస్తే పెద్ద విడ్డూరమే. కర్ణాటకలోని హుబ్లీలో ఓ గర్భిణి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. హావేరి జిల్లాలోని సవణూరు గ్రామానికి చెందిన మహబూబ్‌ బీ అనే గర్భిణి నెలలు నిండడంతో ప్రసవం కోసం హుబ్లీలోని ప్రభుత్వ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్‌ కాన్పు చేశారు. ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల జన్మించారు. ఒక్కో బిడ్డ బరువు రెండు కేజీల వరకూ ఉందని వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. మొదటి ప్రసవంలో ఒక కొడుకు పుట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement