స్వాంతంత్య్ర దినోత్సవాల్లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం నగరంలో ప్రారంభించారు.
న్యూఢిల్లీ: స్వాంతంత్య్ర దినోత్సవాల్లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం నగరంలో ప్రారంభించారు. ఢిల్లీవాసులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్ పిలుపునిచ్చారు. కోట్లాదిమందికి ప్రయోజనకరమైన ఈ పథకం దేశంలోని ఏడు కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలను తెరవనుందన్నారు. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కోటి ఖాతాలను ప్రారంభించినట్లు చెప్పారు. బ్యాంకు ఖాతాలున్నవారు.. లేనివారిని ఖాతా ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్నందున పేదలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హర్షవర్ధన్ చెప్పారు.