బాలికపై గ్యాంగ్‌రేప్ | gang rape On girl | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌రేప్

Jul 16 2015 1:36 AM | Updated on Jul 11 2019 8:35 PM

ఓ బాలికను కిడ్నాప్ చేసి మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బంధించి
పోలీసుల అదుపులో ఓ నిందితుడు
పరారీలో మరో ముగ్గురు

 
బెంగళూరు(బనశంకరి): ఓ బాలికను కిడ్నాప్ చేసి మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల పాటు బాలికను నిర్బంధించి నిరంతరంగా అత్యాచారం జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల 7న ఓ బాలిక(13)ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి మాజీ ఎమ్మెల్యే బి.డి. బసవరాజుకు చెందిన ఫాంహౌస్‌లోని ఇంటిలో బంధించారు. ఆమె కనిపించకుండాపోయిన రోజు తల్లిదండ్రులు ఆలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. నాలుగు రోజుల అనంతరం బాలికను తోటలో వదిలి దుండగులు పారిపోయారు.

అతి కష్టంపై తల్లిదండ్రులను చేరుకున్న ఆ బాలిక తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. నాలుగు రోజుల పాటు తనను గదిలో నిర్బంధించి ఒకరి తరువాత ఒకరు ముసుగులు వేసుకుని నిరంతరంగా అత్యాచారం జరిపినట్లు బాధితురాలు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫాంహౌస్‌ను చేరుకుని ఆధారాలు సేకరించారు. ఫాంహౌస్ మేనేజర్‌తో పాటు అక్కడే పనిచేస్తున్న మరో ముగ్గురు ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫాంహౌస్ మేనేజర్ లోకేష్ అలియాస్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement