గణేశ్ పెళ్లికి లైన్ క్లియర్ | Ganesh Venkatraman Line Clear marriage | Sakshi
Sakshi News home page

గణేశ్ పెళ్లికి లైన్ క్లియర్

Jul 6 2015 2:19 AM | Updated on Sep 3 2017 4:57 AM

గణేశ్ పెళ్లికి లైన్ క్లియర్

గణేశ్ పెళ్లికి లైన్ క్లియర్

యువ నటుడు గణేశ్ వెంకట్రామన్ ప్రేమ వివాహానికి శుభం కార్డు పడింది. అభియుమ్ నానుమ్ చిత్రం ద్వారా తమిళ సినిమాకు

 యువ నటుడు గణేశ్ వెంకట్రామన్ ప్రేమ వివాహానికి శుభం కార్డు పడింది. అభియుమ్ నానుమ్ చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం అయిన నటుడు గణేశ్ వెంకట్రామన్. ఆ తరువాత కమలహాసన్ చిత్రం ఉన్నైపోల్‌ఒరువన్,తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన అచ్చారం చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం పొల్లాదవన్ చిత్ర హిందీ రీమేక్‌లో విలన్‌గా నటిస్తున్నారు. కాగా గణేశ్ వెంకట్రామన్‌కు బుల్లితెర నటి నిషాక్రిష్ణకు మధ్య ప్రేమ మొలకెత్తింది.
 
  కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు పెద్దల అంగీకారం లభించలేదు. అయినా వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య పెళ్లి నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల అయిష్టత కారణంగా వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించినట్లు వెంకట్రామన్ సన్నిహితులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇరు తరపు కుటుంబ సభ్యులు ఈ ప్రేమ జంట పెళ్లికి సమ్మతించడంతో అక్టోబర్ 22న చెన్నైలో ఆడంబరంగా జరగనున్నట్లు వెంకట్రామన్ వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement