ఫైనాన్షియర్ దౌర్జనం: మహిళకు గాయాలు | financier hulchul in anakapalli | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియర్ దౌర్జనం: మహిళకు గాయాలు

Oct 5 2016 12:42 PM | Updated on Oct 2 2018 4:31 PM

తీసుకున్న బాకీ చెల్లించలేదని... మహిళను ఫైనాన్షియార్ చితకబాదాడు.

విశాఖపట్నం : తీసుకున్న బాకీ చెల్లించలేదని... మహిళను ఫైనాన్షియార్ చితకబాదాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై... ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... స్థానిక  ఫైనాన్షియర్ సీతారాం వద్ద రామలక్ష్మీ అనే మహిళ గతంలో రూ. 30 వేలు తీసుకుంది. తీసుకున్న నగదు చెల్లించాలని ఆమెపై గత కొద్దికాలంగా ఒత్తిడి తీసుకువచ్చాడు. 

ఆ క్రమంలో బుధవారం ఉదయం ఆమెను నగదు చెల్లించాలని కోరాడు. అమె మరికొద్ది కాలం గడువు కావాలని కోరింది. దీంతో ఆగ్రహించిన సీతారాం... రామలక్ష్మిపై దాడి చేసి... చితకబాదాడు. స్థానికులు వెంటనే స్పందించి... ఆమెను ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... రామలక్ష్మి ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement