పన్నుల చెల్లింపులో భారత్ పూర్ | Finance Minister Chidambaram warns service tax evaders to file dues before 31 December | Sakshi
Sakshi News home page

పన్నుల చెల్లింపులో భారత్ పూర్

Nov 10 2013 12:55 AM | Updated on Sep 2 2017 12:28 AM

సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్నుశాఖల ఆధ్వర్యంలో చెన్నైలో ని రాణీసీతై హాలులో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం శనివారం జరిగిం ది.

చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్నుశాఖల ఆధ్వర్యంలో చెన్నైలో ని రాణీసీతై హాలులో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం శనివారం జరిగిం ది. ఈ సందర్భంగా చిదంబరం ప్రసంగించారు. పదిహేడు ఏళ్లుగా కేంద్రం సేవా పన్నును వసూలు చేస్తోందన్నారు. తాము స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తామంటూ తొలుత 17 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే 7 లక్షల మంది మాత్రమే తమ మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. మిగిలిన 10 లక్షల మంది పన్ను ఎగవేతకు దారులను వెతుక్కున్నారని తెలిపారు.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరు 31వ లోపు 100 శాతం పన్ను వసూళ్లకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. అలాగని ఎవరినీ భయపెట్టడమో, జరిమానాలు విధించడమోతమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని వెల్లడించా రు. అందరి లెక్కలు, పాన్‌కార్డు నెంబర్లు తమ వద్ద ఉన్నందున పన్ను చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
 
 పన్ను చెల్లింపులో ప్రపంచంలోనే భారత్ చివరి స్థానంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి కేంద్రం దాడులు జరపడం ఆనవాయితీగా వస్తోందన్నారు.  అయితే ఆర్థికశాఖలో తగినంత మంది అధికారులు లేకపోవడం, వాహనాల కొరత వల్ల దాడులకు పూనుకోకుండా స్వచ్ఛంద చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పది మంది పన్ను ఎగవేతదారులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు చిదంబరం తెలి పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జేడీశీలం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement