ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే.. | female elephant raji hulchal in mysore palace | Sakshi
Sakshi News home page

ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే..

Nov 2 2016 11:55 AM | Updated on Sep 4 2017 6:59 PM

ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే..

ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే..

మైసూరు ప్యాలెస్‌కు చెందిన రాజీ అనే 20 సంవత్సరాల ఆడ ఏనుగు మంగళవారం ప్యాలెస్‌ ఆవరణలో బీభత్సం సృష్టించింది.

మైసూరు ప్యాలెస్‌లో బీభత్సం సృష్టించిన ఆడ ఏనుగు 
 
మైసూరు:  మైసూరు ప్యాలెస్‌కు చెందిన రాజీ అనే 20 సంవత్సరాల ఆడ ఏనుగు మంగళవారం ప్యాలెస్‌ ఆవరణలో బీభత్సం సృష్టించింది. వివరాలు.. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా  జంబూ సవారీలో  పాల్గొనడానికి వచ్చిన అర్జున ఏనుగుతో రాజీ సాన్నిహిత్యం పెంచుకుంది. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత అర్జున అడవికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి విరహ వేదనతో ఉన్న రాజీ రెండు రోజులుగా ఆహారం కూడా ముట్టలేదు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం ప్యాలెస్‌ ఆవరణలో పరుగులు పెట్టింది. నియంత్రించడానికి వచ్చిన సొంత మావటి పాషాపై కూడా దాడికి యత్నించింది. అతను చాకచక్యంగా దాని బారి నుంచి తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.  రెండు గంటల పాటు శ్రమించిన మావటీలు రాజీని అదుపులోకి తీసుకువచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement