క్యాప్సికం కాసులవర్షం | Farmer Get Income With Capsicum Corp in Karnataka | Sakshi
Sakshi News home page

క్యాప్సికం కాసులవర్షం

May 16 2019 12:05 PM | Updated on May 16 2019 12:05 PM

Farmer Get Income With Capsicum Corp in Karnataka - Sakshi

పంటను చూపుతున్న మైలారప్ప

యశవంతపుర: సంప్రదాయ రాగి, జొన్న, వరి పంటలకు భిన్నంగా సాగిన రైతు నెలకు రూ. లక్ష లాభాలను కళ్లజూస్తున్నాడు. పాలిహౌస్‌ ద్వారా క్యాప్సికంను సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు రైతు మైలారప్ప సోమప్ప చలవాది. గదగ్‌ జిల్లా నరగుంద తాలూకా కపలి గ్రామానికీ చెందిన రైతు మైలారప్ప పాలి హౌస్‌ ద్వారా రెడ్‌ క్యాప్సికంను సాగు చేశాడు. ఉద్యానవనశాఖ సాయంతో 20 గుంటల భూమిలో 16 లక్షల ఖర్చుతో వేశాడు. అం దులో రెండు వేల క్యాప్సికం మొక్కలను నాటారు. మంచి కాపు రావటంతో రైతులో ఆనందం కలిగిస్తోంది. రెడ్‌ క్యాప్సికం కు మంచి డి మాండ్‌ ఉంది. ఆయన పంటను ఇతర రాష్ట్రాల కు ఉత్పత్తి చేస్తున్నాడు. తక్కువ నీటితోనే మం చి దిగుబడినివ్వడం ఈ పంట ప్రత్యేకత. ఇందులోనే టమోటా సాగును కూడా చేస్తున్నాడు.

తాలూకాలోనే మొదటి రైతు  
తాలూకాలో మొదటిసారిగా పాలిహౌస్‌ ద్వారా కాయగూరల పండించే రైతును తానేనని ఆయన చెప్పాడు. క్యాప్సికం కేజీ నూరు రూపాయిలు పలుకుతోంది. 8 నెలల పాటు దిగుబడినిస్తుంది. నెలకు కనీసం రూ. లక్ష ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. సాగుకు రెండు లక్షల రూపాయలు ఖర్చయింది. ఐదు లక్షల వరకు లాభం వస్తుందని రైతు తెలిపాడు. ప్రతి నెలా క్యాప్సికం ద్వారా రూ. లక్ష లాభం పొందవచ్చని చెప్పారు. మూడు నెలలలో పంట సంపూర్ణంగా చేతికి అందుతుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా తక్కువ నీటితో పంట సాగు చేయవచ్చని చెప్పాడు. పాలి హౌస్‌ విధానంలో తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement