నోట్లో బాటిల్‌ మెడలో పాము | Drunk Man Killed Snake Drive Bike With Alcohol Bottle Karnataka | Sakshi
Sakshi News home page

నోట్లో బాటిల్‌ మెడలో పాము

May 6 2020 7:34 AM | Updated on May 6 2020 7:34 AM

Drunk Man Killed Snake Drive Bike With Alcohol Bottle Karnataka - Sakshi

పామును చంపి మెడలో వేసుకున్న తాగుబోతు

కర్ణాటక, కోలారు: నలభై రోజుల నుంచి పరితపించిన మద్యం దొరికింది. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాననే విచక్షణ కూడా మరిచిపోయాడో మందుబాబు. తాగిన మైకంలో దారిలో పోతున్న పామును పట్టుకుని కొరికి చంపి మెడలో ముడి వేసుకుని హల్‌చల్‌ చేశాడు. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామంలో ఓ తాగుబోతు నిర్వాకం ఇప్పుడు వైరల్‌ అయ్యింది. సోమవారం ఫుల్లుగా తాగి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ఓ నాగు పాము కనిపించింది. అంతే వెంటనే బైక్‌ నుంచి దిగి పామును పట్టుకుని నోటితో కొరకడంతో అది ప్రాణాలు విడిచింది. దానిని మెడలో వేసుకుని మద్యం బాటిల్‌ తాగుతూ ఉండగా కొందరు వీడియోలు తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement