ప్రేమికులకు శుభవార్త.. | Don't Harass Couples at Public Places, Commissioner Rakesh Maria orders mumbai cops | Sakshi
Sakshi News home page

ప్రేమికులకు శుభవార్త..

Aug 22 2015 5:05 PM | Updated on Sep 3 2017 7:56 AM

ప్రేమికులకు శుభవార్త..

ప్రేమికులకు శుభవార్త..

వయసుతో నిమిత్తం లేకుండా జంటగా కనపడే ఎవ్వరి జోలికీ వెళ్లకూడదని, వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ ఏమీ అనొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రేమికులకు శుభవార్త. నాలుగు మాటలతో మొదలై కప్పు కాఫీ దాకా.. అటుపై పార్కుల్లో చక్కర్ల నుంచి షాపింగ్ మాల్లో చిలిపి సరదాల వరకు.. ఆఖరికి హోటల్ లేదా లాడ్జ్ గదుల్లో తీవ్రమైన ముచ్చట్లదాకా ఎలాంటి బెరుకు లేకుండా పార్ట్నర్తో హాయిగా గడపొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. ఆమాటకొస్తే పోలీసులు కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. నమ్మకం కుదరకుంటే ఓ సారి ముంబై వెళ్లిరండి.

వయసుతో నిమిత్తం లేకుండా జంటగా కనపడే ఎవ్వరి జోలికీ వెళ్లకూడదని, వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ ఏమీ అనొద్దని ఇటీవలే ముంబై పోలీసులను కమిషనర్ రాకేశ్ మారియా ఆదేశించారు . మోరల్ పోలీసింగ్ పేరుతో ఇకపై సిబ్బంది ఎవ్వరూ ప్రేమజంటల్ని వేధించొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ఉత్తర్వులు అమలయ్యేలా ఆయా స్టేషన్ల ఇన్చార్జిలకు సూచనలిచ్చారు. ఉన్నట్టుండి పోలీసులకు ప్రేమికులపై ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఏమంటారా..

ఈ నెల మొదటివారంలో ముంబై లంకప్రాంతాలైన అక్సా, మాధ్, దానాపానిల్లోని హోటళ్లు, పార్కులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మొత్తం 64 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో అత్యధికులు ప్రేమపక్షులే కావడం విశేషం. కౌన్సెలింగ్ పేరుతో ఆ ప్రేమ జంటలకు హితబోధ చేసిన పోలీసులు.. చివరికి వారి తల్లిదండ్రులను పిలిపించి తీవ్రస్థాయిలో హెచ్చరించి పంపారు. అలా ఇంటికెళ్లినవారిలో..

ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పరిధిదాటి ప్రవర్తించనప్పటికీ పోలీసుల తీరుతో తల్లిదండ్రుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని, అప్పటి నుంచి పేరెంట్స్ తనతో మాట్లాడటంలేదని, విపరీతమైన మానసిక వ్యధకు గురయ్యానని సూసైడ్ నోట్లో రాసింది. 'మిడ్ డే' పత్రిక ఈ వార్తను వెలుగులోకి తెచ్చింది. అంతే.. నగరం ఒక్కసారిగా భగ్గుమంది. మోరల్ పోలీసింగ్ను నిరసిస్తూ యువత ఐక్యమైంది. ఈ నేపథ్యంలోనే పౌరుల స్వేచ్ఛకు భంగం కల్గించేలా వ్యవహరించొద్దంటూ ముంబై కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement