యాదాద్రికి పోటెత్తిన భక్తులు | devotees rush in yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Apr 13 2017 10:57 AM | Updated on Sep 5 2017 8:41 AM

స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

యాదాద్రి: స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆలయ పూజారులు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. 

Advertisement
 
Advertisement
Advertisement