చలిమంటల్లో పేలిన టపాసులు | crackers explosion at cold fire in chittoor | Sakshi
Sakshi News home page

చలిమంటల్లో పేలిన టపాసులు

Jan 8 2017 12:43 PM | Updated on Sep 5 2017 12:45 AM

చలిమంటల్లో టపాకాయలు పేలి నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

పుంగనూరు: చలిమంటల్లో టపాకాయలు పేలి నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుంగనూరు మండలం జయనగర్‌లో ఆదివారం ఉదయం చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో చలిమంట కాచుకుంటుండగా.. ఒక్కసారిగా మంటల్లో నుంచి పేలుడు సంభవించింది. దీంతో చలిమంట కాచుకుంటున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చలిమంటలో ప్రమాదవశాత్తు టపాకాయలు పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement