ఆ జీవోలు రద్దు చేయాలి: రామకృష్ణ | cpm leader ramakrishna slams ap government | Sakshi
Sakshi News home page

ఆ జీవోలు రద్దు చేయాలి: రామకృష్ణ

May 18 2017 8:07 PM | Updated on Oct 16 2018 6:35 PM

మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడే జీవోలను రద్దు చేయాలని సీపీఎం నేత రామకృష్ణ కోరారు.

అమరావతి:  మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడే జీవో నెం. 279, 159, 160 లను తక్షణం రద్దుచేయాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. జీవో 151 ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో 193 ప్రకారం స్కూల్ స్వీపర్స్, వాచ్‌మెన్లకు కూడా వేతనాలు ఇవ్వాలన్నారు. మునిసిపల్ కార్మికులకు మొండిచేయి చూపిస్తున్న ప్రభుత్వం జీవోలు తెచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం తగదన్నారు. తక్షణం కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement